News February 2, 2026

T20WC వార్మప్ మ్యాచ్.. భారత్ భారీ స్కోర్

image

ICC మెన్స్ T20WC వార్మప్ మ్యాచ్‌లో భారత్-A జట్టు అదరగొట్టింది. USAపై 238/3 స్కోర్ చేసింది. నారాయణ్ జగదీశన్ సెంచరీ(55 బంతుల్లో 104) చేయగా, ప్రియాంశ్ ఆర్య 28(13 B), తిలక్ వర్మ 38(24 B), బదోనీ 60*(26 B) పరుగులతో విరుచుకుపడ్డారు. భారత ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 23 ఫోర్లు నమోదయ్యాయి. అటు USA టీమ్ 9 మంది బౌలర్లను ప్రయోగించినా ప్రభావం చూపలేకపోయింది.

Similar News

News February 14, 2026

చేతులు మెరిసేలా..

image

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.

News February 14, 2026

స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం

image

T20WC: కోల్‌కతా వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటిష్ జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 86కే 4 వికెట్లు పడిన సమయంలో స్కాట్లాండ్ పైచేయి సాధించినట్లే కన్పించింది. ఆపై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా బౌండరీలు బాదుతూ విజయం వైపు నడిచారు. 18.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించారు. బ్యాంటన్ 41 బంతుల్లోనే 63 పరుగులతో రాణించారు.

News February 14, 2026

ALERT: ఇలాంటి వారు ఉపవాసం చేయకండి!

image

మహాశివరాత్రి ఉపవాసం అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడేవారు ఉపవాసం ఉండటం ప్రమాదకరం. వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలు, పండ్లు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శివారాధన చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. share it