News February 2, 2026

ఆదిలాబాద్: ఘరానా మోసగాడు ARREST

image

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో Cheazi Logistics Pvt. Ltd పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తానని నమ్మించి పలువురిని మోసం చేసిన చిత్తూరి శేఖర్‌ను అరెస్ట్ చేశామని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. 2 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది బాధితుల నుంచి రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News February 21, 2026

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

image

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

News February 20, 2026

చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

image

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

News February 20, 2026

ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

image

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.