News February 2, 2026

‘ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరణ జరగాలి’

image

జిల్లాలోని పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్తను సేకరించాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మండలాల వారీగా సమీక్షించారు. కనీసం 75 శాతం చెత్త సేకరణ చేసి త్వరలో 100 శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా అమలు చేయాలని అన్నారు.

Similar News

News February 17, 2026

చెస్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ

image

అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాప్ లీగ్–2026 చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ హాజరై వీటిని ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా నుంచి ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి చేరుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.

News February 17, 2026

నిర్మల్: మైనార్టీలకు ఉచిత శిక్షణ

image

మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ (ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు జైనులు) యువతకు ఉచిత నైపుణ్య శిక్షణను నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. ట్యాలీ విత్ జీఎస్టీ, డిజిటల్ మార్కెటింగ్, అకౌంట్ అసిస్టెంట్, ఫైర్ అండ్ సేఫ్టీలలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 17, 2026

మక్తల్: 6వ వార్డు అభ్యర్థిగా ఎరుకల సత్యమ్మ

image

మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు BJP అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఓటింగ్ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. కాగా తాజాగా అక్కడి నుంచి దివంగత మహదేవప్ప భార్య ఎరుకల సత్యమ్మ పోటీ చేస్తుందని BJP కార్యవర్గ సభ్యులు కొండయ్య తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తనపై పార్టీ నుంచి గాని ఇతరుల నుంచి గాని ఎటువంటి ఒత్తిడి లేదని తన భర్త ఆశయాలకై తానే స్వయంగా బరిలో దిగుతున్నానని స్పష్టం చేశారు.