News February 3, 2026

బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

image

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 5, 2026

కడప: ‘ఇంటర్ పరీక్షలు పక్కగా నిర్వహించాలి’

image

ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని ఆయన కోరారు.

News February 5, 2026

కడప: అప్పుడే మొదలైన ఎండలు.!

image

కడప జిల్లాలో అప్పుడే ఎండాకాల ప్రభావం మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు పలు చోట్ల మండుతున్నాయి. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం పొడిగా ఉంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?

News February 5, 2026

కడప: ఏడుగురు అరెస్ట్

image

కలసపాడు మండలం పెండ్లిమర్రిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుభాన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పెండ్లిమర్రిలో రెండు పేకాట స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.