News April 29, 2024
NZB: ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీలు

ఉమ్మడి NZB జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ వేసవిలో నేతలు మాటల తూటాలతో మరింత వేడిపుట్టిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News February 28, 2026
NZB: వారిపై చర్యలు తీసుకోవాలి: సుదర్శన్ రెడ్డి

లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను గుర్తించాలన్నారు.
News February 28, 2026
NZB: గోడౌన్‌లు సిద్ధం చేయాలి

ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు అని ఆరా తీశారు.
News February 28, 2026
ఎడపల్లి: క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యం: జిల్లా జడ్జి

క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని NZB జిల్లా జడ్జి భరత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. పోలీస్ శాఖ, న్యాయ విభాగం సభ్యులు నిత్యం ఎంతో బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.


