News April 29, 2024

IPL: ఢిల్లీ, కేకేఆర్ పోరులో గెలుపెవరిదో?

image

IPL 2024లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచులు జరిగాయి. ఇందులో ఢిల్లీ 17 సార్లు, KKR 15 సార్లు విజయం సాధించాయి. చివరిగా తలపడిన 4 మ్యాచుల్లో 3-1తో ఢిల్లీదే పైచేయిగా ఉంది. KKR, DC తలో పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో 2, 6 స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News November 9, 2025

కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

image

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.

News November 9, 2025

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.

News November 9, 2025

ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి: లోకేశ్

image

బిహార్ అభివృద్ధి కోసం NDAను మరోసారి గెలిపించాలని మంత్రి లోకేశ్ ఓటర్లను కోరారు. పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. గతంలో APలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నీ పారిపోయాయని తెలిపారు. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బిహార్ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు.