News April 29, 2024

పార్టీ మారిన వారికి గడ్డుకాలం!

image

ఎన్నికల ముంగిట పార్టీలు మారిన అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. వాళ్లు మొన్నటి వరకూ విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నలు సంధించిన పార్టీలోనే ఇప్పుడు చేరారు. దీంతో గతంలో వారు వేసిన ప్రశ్నలకు సమాధానం దొరికిందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాత వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు పోస్టు చేస్తూ.. సెటైర్లు వేస్తున్నారు. పార్టీ మారక ముందు అలా.. మారిన తర్వాత ఇలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Similar News

News March 16, 2026

కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

image

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.

News March 16, 2026

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి

image

98వ ఆస్కార్ అవార్డుల ప్రకటన సందర్భంగా గత ఏడాది కాలంలో చనిపోయిన సినీ ప్రముఖులకు అకాడమీ నివాళులర్పించింది. వీరిలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.

News March 16, 2026

వారికి రూ.2,500 స్కాలర్‌షిప్?

image

TG: GOVT జూనియర్ కాలేజీల్లో చదివే దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కూటర్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10th మార్కుల ఆధారంగా ఏటా 40వేల మందికి ₹2,500 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ 2 స్కీమ్‌లను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. కాగా ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా EV స్కూటీలు ఇస్తామని CM రేవంత్ <<19350603>>ప్రకటించిన<<>> సంగతి తెలిసిందే.