News April 29, 2024
HYD: బార్‌లో బెట్టింగ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. HYD ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరుకూరి రమేశ్ ఓ యాప్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో రమేశ్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 12, 2025
HYD: ORR పరిధిలో 39 STPలు

HYD ORR పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్లతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిందని జలమండలి పేర్కొంది. ప్యాకేజీ- 2 కింద మొత్తం 39 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. మొత్తం సామర్థ్యం 972MLD కాగా.. వ్యయం రూ.3,849.10 కోట్లు కానున్నట్టుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
News September 12, 2025
HYD: ఈ ప్రాంతాల్లో STP కేంద్రాల నిర్మాణం

ORR పరిధిలో 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనుంది. STP కేంద్రాల లిస్టును జలమండలి విడుదల చేసింది. అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి (ORR), సాంగం (బాపూఘాట్), హైదర్షాకోట, ఫతేనగర్, చిట్రాపురి కాలనీ, HYD పబ్లిక్ స్కూల్, మీర్పేట్, మసాబ్‌చెరువు, కాప్రా, రవిర్యాల్, బొంగులూరు వంటి ప్రాంతాల్లో నిర్మిస్తామన్నారు.
News September 12, 2025
పునర్విభజన చట్టం: HYD- అమరావతికి రైల్వే లైన్

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. GM సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని సైతం చెప్పారు.