News February 3, 2026
ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉన్నాయా?

ఇంట్లో అంగుళం కన్న పెద్ద విగ్రహాలు ఉండకూడదు. ఉంటే నిత్య పూజలు చేయాలి. ఎందుకంటే పెద్ద విగ్రహాలకు చాలా ఆకర్షణ శక్తి ఉంటుంది. దాన్ని ఇల్లు భరించలేదు. అలాగే దైవారాధనకు సగుణ, నిర్గుణ అనే 2 మార్గాలున్నాయి. అందులో విగ్రహ పూజ సగుణోపాసన. దీనికి కొన్ని నియమాలుంటాయి. దాని ప్రకారం అంగుళం కన్నా పెద్ద విగ్రహం ఇంట్లో ఉంటే కఠిన నియమాలతో నిత్య పూజలు తప్పక చేయాలి. లేనిపక్షంలో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.
Similar News
News February 17, 2026
VIRAL: ఇస్త్రీ మరకతో ఉన్న షర్టు ఖరీదు రూ.లక్ష!

ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు కొదువ లేదు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘VETEMENTS’ తాజాగా విడుదల చేసిన ఒక షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇస్త్రీ చేస్తుండగా పొరపాటున చొక్కా కాలితే వచ్చే ‘ఐరన్ బర్న్’ మార్కును వీరు డిజైన్‌గా మార్చేశారు. దీని ధర $1,139 (సుమారు రూ. లక్ష). ఈ ధరను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరక పడితే ఇంట్లో గొడవ చేస్తామని, కానీ ఇదే ఓ ఫ్యాషన్ అయిందంటూ సెటైర్లు వేస్తున్నారు.
News February 17, 2026
నైరుతి మూలలో వాస్తు దోషాలు ఉంటే?

నైరుతి దిశలో వాస్తు లోపిస్తే అది ప్రమాదాలకు నిలయమవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తక్కువ ధరకు వస్తుందని ఇలాంటి స్థలాన్ని అస్సలు తీసుకోకూడదు. ఈ దోషం వల్ల కుటుంబ యజమానికి ప్రాణహాని, అకాల మరణాలు సంభవించే అవకాశం ఉంది. తీవ్రమైన వివాదాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి వల్ల జీవితంపై విరక్తి కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వాస్తు దోషం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 17, 2026
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

TG: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 8AM నుంచి 12:30PM వరకే బడులు నడపాలని ఆదేశించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో 1PM నుంచి 5PM వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. APR 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని పేర్కొన్న విద్యాశాఖ.. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది.


