News February 3, 2026

వికారాబాద్: 100 స్థానాలు.. బరిలో 506 మంది

image

జిల్లాలో 100 కౌన్సిలర్ స్థానాలకు గానూ ఆయా పార్టీల నుంచి 506మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం కూడా పలు పార్టీల అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పరిగి 1, తాండూర్ 2, వికారాబాద్ 1, BRS నుంచి తాండూర్ 1, వికారాబాద్ 2, పరిగి 2, కొడంగల్ 1, ఎంఐఎం పార్టీ తరఫున వికారాబాద్లో ఒక నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంది.

Similar News

News February 20, 2026

బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

image

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.

News February 20, 2026

భద్రాద్రి: సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌కు వినతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 2 గంటలపాటు నియోజకవర్గ సమస్యలు, గ్రంథాలయ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. కాగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు.

News February 20, 2026

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు నిర్వహించారు.