News February 3, 2026

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పెరిగిన మిర్చి ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.19,300 పలికింది. అలాగే వండర్ హార్ట్ సోమవారం క్వింటాకు రూ.32,000 ధర పలకగా, మంగళవారం క్వింటాకు రూ.4 వేలు పెరిగి క్వింటాకు రూ.36,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి క్వింటాకు రూ.26,000 ధర పలికింది.

Similar News

News February 22, 2026

28న GVMC కౌన్సిల్ చివరి సమావేశం

image

GVMC కౌన్సిల్ సమావేశం ఈనెల 28న జరగనుంది. 37 అంశాలతో అజెండాను సిద్ధం చేసి కార్పొరేటర్లకు అందజేశారు. విద్యుత్ విభాగంలోని ఒప్పంద కార్మికులను కొనసాగించేందుకు వేతనాల మంజూరు ప్రతిపాదించారు. పారిశుద్ధ్యం, భూగర్భ మురుగునీటి విభాగ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయనున్నారు. 81వ వార్డులో పైపులైన్ల మార్పు, 95వ వార్డులో రిటైనింగ్ వాల్, 1వ వార్డులో కాలువలు, 71వ వార్డులో బీటీ రహదారి పనులు అజెండాలో చేర్చారు.

News February 22, 2026

పరీక్ష కేంద్రాలవద్ద 163 సెక్షన్ అమలు: ASP హేమంత్

image

చింతూరు డివిజన్‌లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ASP హేమంత్ అన్నారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే చింతూరు జూనియర్ కళాశాలను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. వీఆర్‌పురం, చింతూరు, కూనవరం పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పటిష్ఠమైన బందోబస్త్ ఉంటుందన్నారు. ఇతరులు కేంద్రాల వద్దకు రావద్దన్నారు. ఎస్‌ఐ రమేష్ ఆయన వెంట ఉన్నారు.

News February 22, 2026

మరోసారి ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్

image

NCP(SP) చీఫ్ శరద్ పవార్(85) <<19143304>>మరోసారి<<>> పుణేలోని ఆస్పత్రిలో చేరారు. డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవార్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ రెండు రోజులు ఆస్పత్రిలో ఉంటారని చెప్పారు. కాగా ఈ నెల 9న ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరి 14వ తేదీన డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.