News April 29, 2024

గ్రేటర్ HYDలో 8,81,201 ఓట్ల తొలగింపు!

image

ఓటరు జాబితాలో ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8,81,201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,41,201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4,39,801 మంది నివాసం మారగా.. 54,259 మంది డూప్లికేట్, 47,141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2.6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 3, 2025

HYD: ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండా సురేఖ

image

HYD జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం-2025 సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ శాఖ అంశాలతో పాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ నగర అభివృద్ధి గురించి చర్చించినట్టు సమాచారం.

News January 3, 2025

క్రికెట్ జట్టుకు హైదరాబాద్ కుర్రాడు

image

HYDకు చెందిన మరో క్రికెటర్ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్‌ వాసి రాపోల్ సాయి సంతోష్ దేశవాళీ 2024-25 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్ అండర్-23 క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. BCCI మెన్స్ అండర్-23 స్టేట్-ఏ ట్రోఫీ కోసం జరగనున్న పోటీలకు అరుణాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏళ్ల సంతోష్ జట్టులో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయి అండర్-16,17 గేమ్స్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

News January 3, 2025

రేవంత్ రెడ్డి పాన్ ఇండియా CM: చామల

image

రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంతమంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిశారన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఫేమస్ అయ్యారని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చి రైతులను బీఆర్ఎస్ మోసం చేసేందుకు ప్లాన్ చేసిందని చామల ఆరోపించారు.