News April 29, 2024

నంద్యాల: సీటు రాలేదని ఆత్మహత్య

image

నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. పీజీలో సీటు రాలేదని మనస్తాపానికి గురైన డా.షేక్ గని అతావుల్లా(25) ఆదివారం నంద్యాల శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇతను దేవనకొండ మాండలం తెర్నేకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మర్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 9, 2026

శిథిలావస్థలో చరిత్ర గల శివాలయం

image

నందవరం మండలం రాయచోటిలో శ్రీకృష్ణదేవరాయల నాటి చరిత్ర కలిగిన శివాలయం ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పలుమార్లు ఈ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు లంకె బిందెల కోసం తవ్వకాలు జరిపి, ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు, శివభక్తులు రెండేళ్లుగా ఆలయం పరిసరాలను శుభ్రం చేస్తూ కాపాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా రక్షణ కల్పించాలని కోరారు.

News January 9, 2026

అక్రమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: కర్నూలు కమిషనర్

image

కర్నూలులో అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, డిజిటల్ హోర్డింగులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు. ప్రకటన ఏజెన్సీలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.30 వేల వరకు జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏజెన్సీలు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు.

News January 8, 2026

కర్నూలు జిల్లాలో 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 56, టైప్-4 కేజీబీవీల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.