News February 3, 2026
మెదక్: మున్సిపల్.. తల్లి, కొడుకు పోటీ

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో రక్తసంబంధీకుల పోటీ ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఛైర్మన్ బట్టి జగపతి సతీమణి లలితతో పాటు ఆమె కుమారుడు ఉదయ్ కూడా బరిలో నిలిచారు. గతంలో 18వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన లలిత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, గత ఎన్నికల్లో 5వ వార్డులో ఓటమి చెందిన ఉదయ్ ఈసారి విజయంపై ధీమాతో ఉన్నారు. తల్లి, కొడుకుల ఫలితం ఎలా ఉంటుందోనని పట్టణంలో చర్చ నడుస్తోంది.
Similar News
News February 4, 2026
పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం: డీఈవో

విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని DEO విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశాన్ని పాటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.
News February 3, 2026
మెదక్: ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష

మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావుతో కలిసి పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. పోలీసులకు ఎన్నికల చట్టాలపై లీగల్ అవగాహన కల్పించి, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 3, 2026
మెదక్ మున్సిపల్ బరిలో 113 మంది.. ఒక వార్డు ఏకగ్రీవం

మున్సిపల్ ఎన్నికల పోరులో మెదక్ మున్సిపాలిటీలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది. మొత్తం 32 వార్డులకు గాను, 32వ వార్డు కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 31 వార్డుల్లో 112 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీల వారీగా.. కాంగ్రెస్ 32, బీఆర్‌ఎస్ 31, బీజేపీ 27 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా, బీఎస్పీ 6 చోట్ల పోటీ చేస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉండటం ఆసక్తికరంగా మారింది.


