News February 3, 2026

GNT: 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం ఈయనే

image

తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రవర్తి గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. ఆయన 1971 నుంచి 1989 వరకు సంగీత రంగాన్ని ఏలారు. 959 సినిమాలకు సంగీతం, దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ ఇచ్చారు. 1989లో విడుదలైన 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం అందించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2002 ఫిబ్రవరి 3న ఆయన కన్నుమూశారు.

Similar News

News February 15, 2026

గుంటూరు జిల్లా ప్రజలకు కీలక సూచన

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేశారు. మహాశివరాత్రి బందోబస్తు విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారులందరూ ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News February 15, 2026

ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

image

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.

News February 15, 2026

గుంటూరు జిల్లాలో శివరాత్రికి పటిష్ఠ భద్రత

image

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు శివాలయాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వడ్లమూడి, పెదకాకాని, పేరేచర్ల, తెనాలి, తాడేపల్లి ఆలయాల వద్ద ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.