News February 3, 2026

వికారాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బోణీ

image

వికారాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బోణీ కొట్టాయి. 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనంతరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15వ వార్డు <<19040568>>బీఆర్ఎస్<<>> అభ్యర్థి విజయలక్ష్మి విజయ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. అయితే అధికార బలంతో కాంగ్రెస్ నాయకులు తమ అభ్యర్థులను బలవంతంగా విత్ డ్రా చేయిస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆరోపించారు. దీంతో వికారాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.

Similar News

News February 7, 2026

కాట్రేనికోన: దైవదర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం

image

కుండలేశ్వరం ఆలయ దర్శనం ముగించుకుని వస్తుండగా బైకు పైనుంచి పడి రాజమండ్రికి చెందిన పల్లి నాగలక్ష్మి(32) మృతి చెందారు. శనివారం రాత్రి కొమనపల్లి సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై జ్వాల సాగర్ తెలిపారు. భర్త కుమార్ తో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 7, 2026

సిద్దవటం: రైలు ఢీకొని తల్లీకూతురు మృతి

image

సిద్దవటం మండలం కనుమల్లోపల్లి వద్ద రైలు ఢీకొని <<19077063>>ఇద్దరు వృద్ధ మహిళలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలను ఇవాళ సాయంత్రం రైల్వే పోలీసులు వెల్లడించారు. వీరు మాధవరం-1, 16వ వీధికి చెందిన రామలక్షుమ్మ (75), లక్షుమ్మ(50), వీరిద్దరు తల్లీకూతుళ్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News February 7, 2026

కాకినాడ: ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ ప్రయోగ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు రెండో రోజు 58 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం సెషన్‌లో 2800 మంది, మధ్యాహ్నం 2321 మంది విద్యార్థులు హాజరయ్యారు. బోర్డు అబ్జర్వర్ నరసింహారావు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ప్రయోగ పరీక్షల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.