News February 3, 2026

ఆదిలాబాద్: పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి

image

భీంపూర్ మండలం గొల్ల ఘాట్, గుంజాల మధ్య శివారులో పిప్పల కోటి గ్రామానికి కొగురు విట్టల్‌కు చెందిన లేగ దూడ పై మంగళవారం పెద్ద పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అటవీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి ట్రాప్ కెమెరాలను అమర్చినట్లు ఆదిలాబాద్ రేంజ్ అధికారి గులాబ్ సింగ్ తెలిపారు. పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ యజమానికి నష్ట పరిహారం చెల్లిస్తామని, అటు వైపు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు.

Similar News

News February 10, 2026

టెన్త్ విద్యార్థినితో టీచర్ పెళ్లి.. చివరికి!

image

TG: పాఠాలు నేర్పాల్సిన గురువే విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. మేడ్చల్ పోచారం పరిధిలోని ఓ స్కూల్‌లో మైటీన్(27) టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో టెన్త్ చదువుతున్న బాలికను లోబరుచుకొని పెళ్లి చేసుకున్నాడు. బాలిక మెడలో తాళిని చూసిన కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో అసలు విషయం బయటపడింది. వారి ఫిర్యాదుతో టీచర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 10, 2026

పాలమూరు: అత్తపై అల్లుడి అత్యాచారం, హత్య

image

NGKL జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేటలో అమానవీయ ఘటన జరిగింది. అత్తపై అల్లుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు సీఐ నాగార్జున తెలిపారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తిమ్మాజిపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి తన కూతురిని ఇచ్చి వివాహం చేసింది. ఇద్దరు తరచూ గొడవ పడుతుండటంతో వారిని తన ఇంటి వద్ద ఉంచుకుంది. కూతురు వేరే గ్రామానికి వెళ్లడంతో ఆ వ్యక్తి అత్తపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించారు.

News February 10, 2026

టీ20 WCలో నేటి మ్యాచులు ఇవే

image

T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు రాణిస్తుండటం పెద్ద టీమ్‌లకు సవాలుగా మారుతోంది. ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11am నుంచి నెదర్లాండ్స్vsనమీబియా (ఢిల్లీ), 3pm నుంచి NZvsUAE (చెన్నై), 7pm నుంచి PAKvsUSA (కొలొంబో) మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. కాగా 2024WCలో పాక్‌పై USA సూపర్ ఓవర్‌లో గెలిచిన నేపథ్యంలో నేటి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశముంది.