News February 3, 2026

HYD: గూగుల్‌లో సెర్చ్ చేసి.. SUICIDE

image

కూకట్‌పల్లికి చెందిన విజయలక్ష్మి (26) మరణం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల్లో వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె, హుస్సేన్‌సాగర్‌లో శవమై తేలింది. చనిపోవడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం. పెళ్లి కాలేదనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగినప్పటికీ, పోలీసులు దానిని ఖండించారు. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఏదైనా బతికి సాధించాలని సూచించారు.

Similar News

News February 10, 2026

IT కోటలో ఐఐటీయన్ల అడ్డా

image

మన హైదరాబాద్ గడ్డపై ఐఐటీయన్లు గట్టిగానే ప్లాన్ చేశారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు మద్దతుగా మార్చి 8న వెస్టిన్ హోటల్‌లో ‘పాన్-ఐఐటీ సదస్సు’ జరగనుంది. త్వరలో ఫ్రాన్స్‌లో జరిగే ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి కూడా వీరు తోడుగా నిలవనున్నారు. ప్రభాత్ కుమార్ నేతృత్వంలో ఐఐటీ HYDలో కొత్త ఆఫీసు కూడా రాబోతోంది. ఆరోగ్యం, డిఫెన్స్ రంగాల్లో ఏఐ విప్లవంపై 600 మందికి పైగా నిపుణులు ఈ వేదికపై చర్చించనున్నారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

image

కంటోన్మెంట్ MLA శ్రీ గణేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాల బస్ స్టాప్ సమీపంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.