News February 3, 2026

SPMVV: వివిధ ఫలితాలు విడుదల

image

SPMVVలో గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంసీఏ (MCA) మూడో సెమిస్టర్, డిసెంబర్ నెలలో బీఎస్సీ హానర్స్ స్టాటిస్టిక్స్/ B.Voc న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్/ B.Voc ఫ్యాషన్ టెక్నాలజీ 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. విద్యార్థినులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News February 12, 2026

వరంగల్: బాక్సులో భవిష్యత్!

image

మున్సిపల్ పోరు ముగిసింది. ఇక ఫలితమే బాకీ ఉంది. బ్యాలెట్ బాక్సులో భవిష్యత్ ఉండటంతో అభ్యర్థుల్లో లబ్ డబ్ అంటూ గుండె వేగం పెరిగింది. మరో 24 గంటల్లో తమ పెట్టబడికి లాభామా? నష్టమా? అంటూ మథన పడుతున్నారు. మరో పక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎంత అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్, BRSలు ఇప్పటికే వార్డుల్లో సర్వే చేసుకున్నాయి.

News February 12, 2026

Way2 ఎఫెక్ట్.. యానాది కుటుంబాలకు విముక్తి

image

నాగయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాది కుటుంబాలతో వెట్టిచాకిరి చేపిస్తున్న ఘటనపై Way2Newsలో ‘<<19085249>>మాకు విముక్తి కల్పించండి సార్<<>>’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేసి 27 యానాది సంచార కుటుంబాలను పరిశీలించగా, 11 కుటుంబాలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న దళారులను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని తెలిపాయి.

News February 12, 2026

BNGR:మున్సిపల్ ఎన్నికలు అప్పుడు అలా.. ఇప్పుడిలా..!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2026లో 2 శాతం మేర తగ్గింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మొత్తం 1,30,192 ఓటర్లు ఉండగా 1,13,398 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 87.1 శాతం పోలింగ్ నమోదయింది. ఓటింగ్ శాతం తగ్గాడానికి కారణాలు కామెంట్ చేయండి.