News February 4, 2026
క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో PGRS, రీసర్వే, మ్యుటేషన్, వెబ్‌ల్యాండ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సేవలపై ఆయన సమీక్షించారు. రీసర్వే ప్రజలకు అనుకూలంగా చేపట్టాలన్నారు. E-పాస్‌బుక్స్, K-KYC, ROR కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.
Similar News
News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 13 నుంచి 15 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 3 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.
News February 11, 2026
కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎక్కడంటే!

కామారెడ్డి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 79.77% పోలింగ్ నమోదయిందని అధికారులు వెల్లడించారు. 5,110 (80.84%) పురుషులు, 5,470 (78.78%) మహిళలు, ఇతరులు 1(100%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో మొదటి సాధారణ ఎన్నికల్లో సైతం ఎల్లారెడ్డిలోని అత్యధికంగా ఓటింగ్ శాతం(2020లో 84.6%) నమోదైంది.


