News February 4, 2026

కరీంనగర్ ‘పుర’ సమరం.. బరిలో 398 మంది

image

కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల చిత్రం స్పష్టమైంది. మొత్తం 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ (66 చొప్పున), కాంగ్రెస్‌ (65), ఫార్వర్డ్ బ్లాక్ (31), ఎంఐఎం (15), జనసేన (14), బీఎస్పీ (7) పోటీ పడుతున్నాయి. సీపీఐ, సీపీఐ-ఎంఎల్ నుంచి ఒక్కొక్కరు, ఇతర పార్టీల నుంచి 9 మంది, 123 మంది స్వతంత్రులు బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News February 19, 2026

KNR: ‘10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న నెల రోజులు పదో తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అన్నారు. అందువల్ల ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News February 19, 2026

KNR: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (2026-27) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఎం. నాగేశ్వర్ తెలిపారు. అర్హత గల పాఠశాలలు తమ దరఖాస్తులను మార్చి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం రెసిడెన్షియల్ కింద రూ.42,000, నాన్-రెసిడెన్షియల్ కింద రూ.28,000 చెల్లిస్తారు.

News February 19, 2026

కరీంనగర్: చెక్ డ్యామ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిషిద్ధం

image

నదులపై ఉన్న చెక్ డ్యామ్‌ల రక్షణ దృష్ట్యా వాటికి ఎగువ, దిగువన 300 మీటర్ల మేర ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌తో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో ఇసుక నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.