News April 29, 2024
NZB: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో అజంతా ఎక్స్ప్రెస్ రైలు వెళ్లేక్రమంలో ఓ యువకుడు హఠాత్తుగా రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. యువకుడు వైలెట్ కలర్ షర్ట్, బ్లూ జీన్ పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపట్టి ఉంటే రైల్వే పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.
Similar News
News March 2, 2026
డిచ్‌పల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి

డిచ్‌పల్లి మండలం దూస్ గాన్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విక్రమ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కి చెందిన జగన్నాథం శనివారం దూస్‌గాన్ గ్రామానికి పని నిమిత్తం వచ్చాడు. ఊరు చివరన గల కొత్త చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి మృత దేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 2, 2026
NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News March 1, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.


