News April 29, 2024
ప.గో.: భార్యాభర్తలు MLAలుగా.. ఇద్దరూ INDEPENDENT

ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గంలో వేర్వేరు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన భార్యాభర్తలు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. 1967లో కట్రెడ్డి కుసుమేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోకరాజు రంగరాజుపై 3997 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత 1970లో జరిగిన ఉప ఎన్నికలో కట్రెడ్డి భార్య ఆండాళ్ళమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు.
Similar News
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 2, 2025
బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.


