News April 29, 2024
ఏకగ్రీవం ఆమోదనీయమేనా?
ఇటీవల సూరత్ MP స్థానం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. విలువైన ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మంచి చేస్తామని నేతలు అంటుంటారు. మరి ఏకగ్రీవంలో ఓట్లు ఉండవు. నాయకులెలా బాధ్యతగా ఫీల్ అవుతారు? ఏకగ్రీవం అయిన స్థానాల్లో ఎంతో విలువైన ప్రజల ఓటు హక్కు వృథా అయినట్లేగా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ ఏకగ్రీవంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. <<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 28, 2024
న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త
TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.
News December 28, 2024
నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
AP: విజయవాడ కేబీఎన్ కాలేజీ వేదికగా నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సభలను ప్రారంభించనుండగా, ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా భాషాభిమానులు, కవులు పాల్గొంటారు.
News December 28, 2024
టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల కష్టాలు
TG: టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్/ఇతర ప్రయారిటీ ఇచ్చిన జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. చాలా దూరం ప్రయాణం చేసి పరీక్ష రాయాల్సి ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనవరి 11, 20వ తేదీల్లో జరిగే పరీక్షలకు హాల్ టికెట్లను ఇవాళ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.