News April 29, 2024
కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్
TG: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఏఐసీసీ నేత, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అటు త్వరలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
Similar News
News December 28, 2024
అంత సీన్ లేదు ‘పుష్పా’..!
AP: ‘పుష్ప-2’లో టన్ను ఎర్రచందనానికి రూ.కోటిన్నర వస్తాయని హీరో చెప్పడం గుర్తుందా? కానీ అటవీశాఖ మాత్రం అంత సీన్ లేదంటోంది. ఎర్రచందనం అమ్మేందుకు టెండర్లు పిలిచినా అంతగా స్పందన కనిపించట్లేదట. టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించగా, చాలా మంది రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. చైనా, జపాన్, సింగపూర్, అరబ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఖరీదైన ఫర్నిచర్ వినియోగం తగ్గి ఎర్రచందనానికి డిమాండ్ పడిపోయిందని అంచనా.
News December 28, 2024
పంత్ ఈసారి ఫెయిల్!
ఆస్ట్రేలియా గడ్డపై సూపర్ రికార్డు ఉన్న రిషభ్ పంత్ ఈసారి విఫలం అవుతున్నారు. BGT 2024-25లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. మొదటి టెస్టులో 38, రెండో టెస్టులో 49, మూడో టెస్టులో 9, నాలుగో టెస్టు (ఫస్ట్ ఇన్నింగ్స్)లో 28 పరుగులు మాత్రమే చేశారు. పంత్ బలహీనతలపై ఆస్ట్రేలియా బౌలర్లు ఫోకస్ చేసి ఔట్ చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
News December 28, 2024
మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి
AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.