News February 4, 2026

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ వ్యూహమే!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ వ్యూహంగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, BRS, BJPల మధ్య పోటీ ఉండనుంది. అత్యధికంగా 3, 4వ వార్డుల్లో ఏకంగా 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 31వ వార్డులో 9 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా మిగతా అన్ని వార్డుల్లో ఐదుగురు బరిలో ఉన్నారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కోసం BJP వ్యూహం రచించగా, అధికారం కోల్పోయిన BRS ప్రయత్నాలు కొనసాగిస్తుంది.

Similar News

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 3-5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2-4 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 2-3, MIM 1, ఇతరులు ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

సంక్రాంతి బరిలో మరో హీరో?

image

చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ‘ఆయ్’ ఫేమ్ అంజి డైరెక్షన్‌లో మూవీని ఓకే చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్‌తోనే పండుగ వైబ్ వచ్చేలా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే పేరును లాక్ చేసినట్లు చర్చించుకుంటున్నాయి. అటు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌తో పాటు శర్వానంద్, తేజా సజ్జ మూవీలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టీటౌన్ వర్గాల మాట.

News February 11, 2026

రైల్వే సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

image

జిల్లాలో నెలకొన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ నాగరాజు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన.. బుధవారం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు కొత్త రైలు సర్వీసులను పెట్టడంతో పాటు ఇతర సర్వీసులను పొడిగించాలని కోరారు.