News April 29, 2024
GREAT: గురుదక్షిణగా రూ.12 లక్షల కారు

AP: చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పి తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువును మరువలేదు ఈ పూర్వ విద్యార్థులు. గురువు రిటైర్మెంట్ అవుతుండటంతో గురుదక్షిణగా రూ.12 లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. పల్నాడు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు జేమ్స్ గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయలో పనిచేశారు. ఏప్రిల్ 30తో ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఆ నవోదయ పూర్వ విద్యార్థులు తమ గురువును సత్కరించి కారు అందజేశారు.
Similar News
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని <
News January 15, 2026
U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.


