News February 4, 2026

కల్వకుర్తి: పురపోరులో ఎంబీఏ విద్యార్థిని ‘విందు’

image

కల్వకుర్తి మున్సిపాలిటీ 15వ వార్డు బీజేపీ అభ్యర్థిగా ఎంబీఏ విద్యార్థిని పెద్దారి విందు బరిలో నిలిచారు. మాజీ కౌన్సిలర్ పెద్దారి విజయ్ కుమార్తె అయిన ఆమె, కాంగ్రెస్, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యువత ప్రాతినిధ్యం పెరగాలని, వార్డు అభివృద్ధికి తనను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు.

Similar News

News February 19, 2026

తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

image

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.

News February 19, 2026

KMR: సహేరి అంటే ఏమిటి? ఇఫ్తార్‌ విశిష్టత ఇదే..

image

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, అంటే ఫజర్ అజాన్ కంటే ముందే తీసుకునే ఆహారాన్ని ‘సహేరి’ అంటారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉండేందుకు శరీరానికి అవసరమైన శక్తిని ఈ ఆహారం అందిస్తుంది. రోజంతా నీరు కూడా ముట్టకుండా కఠిన దీక్షను పాటించిన అనంతరం, సూర్యాస్తమయం వేళ దీక్షను విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సాధారణంగా ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు.

News February 19, 2026

తాబేళ్లను మొక్కుబడిగా సమర్పించే దేవాలయం!

image

అస్సాంలోని హజోలో మణికూట పర్వతంపై విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి కోనేరులో భక్తులు తాబేళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. తాబేళ్లను కూర్మావతారంగా పూజిస్తారు. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడు మోక్షం పొందిన ‘మహాముని’ క్షేత్రంగా కొలుస్తారు. క్రీ.శ.1583లో నిర్మితమైన ఆలయ శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధు, కైటభ రాక్షసులను విష్ణుమూర్తి ఇక్కడే సంహరించారని పురాణాల వాక్కు.