News February 4, 2026
విమానంలో చోరీ.. లగేజీలోని గోల్డ్, డైమండ్ ఆభరణాలు మాయం

విమాన ప్రయాణంలో తన లగేజీలోని గోల్డ్, వజ్రాలు పోయాయంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో స్థిరపడిన శాంతారమేశ్ గతేడాది నవంబర్ 15న బెంగళూరు నుంచి అబుదాబికి ప్రయాణించారు. అక్కడికి వెళ్లాక లగేజీలోని 790 గ్రా. గోల్డ్, రూ. 8లక్షల విలువైన వజ్రాభరణాలు, $200 నగదు మిస్సయినట్లు గుర్తించారు. విమానాశ్రయ అధికారులను సంప్రదించగా పరిష్కారం దొరక్కపోవడంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 7, 2026
పోర్న్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాడు.. వీడియో చూసి షాక్ తిన్నాడు..

పోర్న్ చూడ్డానికి ఓ వెబ్‌సైట్‌కు వెళ్లిన ఎరిక్ అనే వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ప్లే అవుతున్న వీడియోలో ఉన్నది తానే అని గుర్తించి కంగుతిన్నారు. హాంకాంగ్‌కు చెందిన ఆయన ఓసారి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చైనాలోని హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా గడిపారు. దీన్ని హోటల్ సిబ్బంది స్పై కెమెరా ద్వారా రికార్డు చేసి సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇలా పదేళ్లుగా జరుగుతున్నట్టు ఎరిక్ తర్వాత గుర్తించారు.
News February 7, 2026
కాలి బూడిదైన కీలక ఎవిడెన్స్..?

TG: నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన <<19075310>>అగ్నిప్రమాదంలో<<>> రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న పలు కీలక కేసుల ఫైల్స్ ఉన్నాయని అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన గదిలోనే ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవిడెన్స్, హార్డ్ డిస్క్‌లు, BRS ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ ఫైల్స్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతోపాటు కొంతమంది అధికారుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల ఫైల్స్ కూడా బూడిదయ్యాయని సమాచారం.
News February 7, 2026
రుషులు, మునులు, యోగులు, సాధువులు, సన్యాసులు.. వీరంతా ఒకటేనా?

వేద మంత్రాలను, విశ్వ సత్యాలను దర్శించిన పరిశోధకులు ‘రుషులు’. వీరు తపస్సుతో రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షులవుతారు. మౌనమే ఆయుధంగా నిరంతరం ధ్యానంలో నిమగ్నమయ్యే ‘మునులు’. యోగాభ్యాసంతో మనస్సు, శరీరాన్ని నియంత్రించి దైవంతో ఐక్యత సాధించేవారు ‘యోగులు’. ప్రాపంచిక కోరికలనొదిలి భక్తి మార్గంలో సమాజ సేవ చేసేవారు ‘సాధువులు’. సర్వస్వం త్యజించి, భిక్షాటన చేస్తూ కేవలం మోక్షం కోసమే తపించేవారు ‘సన్యాసులు’.


