News February 4, 2026

సిద్దిపేట: ‘పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల్లో జాప్యం చేయరాదని, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా ముగించాలని స్పష్టం చేశారు.

Similar News

News February 17, 2026

ఫుడ్ సేఫ్టీపై హనుమకొండ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఆహార నాణ్యతపై రాజీ పడొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వారానికి కనీసం 3రోజులు మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా తాగునీటి శుద్ధి, వంటగదుల పరిశుభ్రతను నిశితంగా పరిశీలించాలని సూచించారు. స్ట్రీట్ వెండర్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.

News February 17, 2026

సంగారెడ్డి: ‘బెస్ట్ అవైలబుల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేట్ పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఐదు సంవత్సరం నుంచి 10వ తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు మాత్రమే అర్హులని చెప్పారు. మార్చి 25వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయంలోని తమ కార్యాలయంలో ప్రవేట్ పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 83285 08067 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News February 17, 2026

ఇది కదా సక్సెస్ అంటే..

image

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య పాత ఫొటో ఒకటి SMలో వైరలవుతోంది. 2014లో తన ఫ్రెండ్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి హాజరైనప్పటి ఫొటో అది. కట్ చేస్తే.. కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని 30Y వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. సక్సెస్ అంటే ఇదేనని, ఎంత ఎత్తుకు ఎదిగినా అతను ఇప్పటికీ తన స్నేహితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు.