News February 4, 2026
సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత.. ఎంపీ ప్రశ్నకు సమాధానం

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ వెల్లడించారు. సోలార్ విద్యుత్ ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై బుధవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రమంత్రి వివరాలు వెల్లడించారు.
Similar News
News February 13, 2026
విజయ్-రష్మిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు ₹60 కోట్ల ఆఫర్?

టాలీవుడ్ క్రేజీ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఈ నెల 26న జరగనుందని SMలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి మ్యారేజ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹60 కోట్లు ఆఫర్ చేయగా.. ఈ జంట నో చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార, విఘ్నేశ్ పెళ్లి డాక్యుమెంటరీకి ఇదే OTT ప్లాట్‌ఫామ్ ₹25 కోట్లు చెల్లించగా వివాదమైంది.
News February 13, 2026
KCR ఇలాకా.. మున్సిపల్ పీఠానికి చేరువలో BRS

మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో పోలింగ్ కౌంటింగ్ రసవత్తరంగా సాగుతుంది. 20 వార్డులకు 14 వార్డుల ఫలితాలు రాగా అందులో BRS 8, కాంగ్రెస్ 5 వార్డులు, BJP ఒక వార్డు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా BRS 3 సీట్ల దూరంలో ఉంది. ఎన్నికల ఫలితాలపై BRS నాయకులు ఉత్కంఠగా చూస్తున్నారు. BRS 1,2,3,5,6,10,11,15 వార్డుల్లో, కాంగ్రెస్ 7,8,9,14 వార్డుల్లో, BJP 4వ వార్డులో గెలిచింది.
News February 13, 2026
BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.


