News February 4, 2026

అల్లూరి కలెక్టర్ కీలక ఆదేశాలు

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక, అటవీ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ‘హోం స్టే’ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.

Similar News

News February 20, 2026

AI SUMMIT: రాహుల్ విమర్శ.. థరూర్ ప్రశంస!

image

కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదేనని మరోసారి నిరూపితమైంది. AI సమ్మిట్ లోపాలతో మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేసిందని రాహుల్ మండిపడటం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా సమ్మిట్ బాగా జరిగిందని INC MP థరూర్ పొగిడారు. కొన్ని లోపాలు సహజమన్నారు. గతంలోనూ థరూర్ NDA ప్రభుత్వాన్ని మెచ్చుకోగా పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. ఇటీవలే అవి సమసి ఆయనకు కేరళ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.

News February 20, 2026

గ్లోబల్ ఈవెంట్‌లో నిరసనలపై విమర్శలు.. మీరేమంటారు?

image

ఢిల్లీలో జరుగుతోన్న AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల నిరసనలపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రదర్శనలకు ఎన్నో వేదికలు ఉన్నాయని, గ్లోబల్ ఈవెంట్‌లో ఇలా చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. దేశాధినేతలు హాజరైన సదస్సులో చొక్కాలువిప్పి <<19192072>>ఆందోళనలు<<>> చేయడం దేశానికి అప్రతిష్ఠను కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఏర్పాట్లలో లోపాలతో కేంద్రమే పరువు తీసిందని INC అభిమానులు కౌంటరిస్తున్నారు. మీరేమంటారు?

News February 20, 2026

క్యాతన్‌పల్లిలో ఓటుకు రూ. కోటి?

image

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి వివేక్ ముగ్గురు కౌన్సిలర్లకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. BRS, CPIకౌన్సిలర్లు అందుబాటులోకి రాకపోవడంతో బేరసారాలు ఫలించలేదని సమాచారం. అటు ఇక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు KCR స్వయంగా హరీశ్ రావును రంగంలోకి దింపారు. దీంతో ఆయన MLA కోవా లక్ష్మితో కలిసి కౌన్సిలర్లు చేజారిపోకుండా మంతనాలు చేస్తున్నారు.