News February 4, 2026

వార్మప్ మ్యాచ్.. SAకి భారీ టార్గెట్

image

సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20WC వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(53), తిలక్ వర్మ(45), అక్షర్ పటేల్(35), సూర్యకుమార్(30), పాండ్య(30) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, కోర్బిన్, అన్‌రిచ్, మఫాకలు తలో వికెట్ తీశారు. విజయం కోసం SA బ్యాటర్లు 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి.

Similar News

News February 18, 2026

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

image

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.

News February 18, 2026

ఎక్కువ సార్లు డకౌట్ అయింది వీరే

image

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్లు వీరే:
12- రోహిత్ శర్మ (151 ఇన్నింగ్సులు)
7- విరాట్ కోహ్లీ (117)
7- సంజూ శాంసన్ (50)
6- అభిషేక్ శర్మ (40)
6- సూర్య కుమార్ యాదవ్ (102)
5- అర్ష్‌దీప్ సింగ్ (28)
5- కేఎల్ రాహుల్ (68)

News February 18, 2026

24న ఏపీ మంత్రివర్గ సమావేశం

image

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఇందుకు సంబంధించి క్యాబినెట్ నోట్స్‌ను రూపొందించి సమర్పించాలని అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరుగుతుందన్నారు.