News February 4, 2026
SRPT: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలు సవ్యంగా, నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పోలీస్ శాఖ నూతనంగా చేపట్టిన ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News February 14, 2026
ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా రోల్ ఆఫర్.. నాగార్జున క్లారిటీ

బాక్సాఫీస్ వద్ద రూ.వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ఈ పాత్రలో నటించాలని మేకర్స్ తొలుత నాగార్జునను అడిగారని, డేట్స్ అడ్జస్ట్ కాక తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై నాగ్ స్పందిస్తూ ఈ క్యారెక్టర్ గురించి తనకెలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా నటన అద్భుతమని, అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
News February 14, 2026
ప్రజా నేత ‘గుమ్మడి’కి అరుదైన గౌరవం

రాజకీయాల్లో నిరాడంబరతకు, నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆయన ప్రజా సేవను గుర్తించి ‘డాక్టరేట్’ ప్రదానం చేసింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సామాన్య జీవితాన్ని గడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన నరసయ్యకు ఈ పురస్కారం లభించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
News February 14, 2026
BRS విప్ ఇస్తే గైర్హాజరయ్యేలా ఆ MLAల ప్లాన్!

TG: ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే MP, MLA, MLCలు కీలకంగా మారారు. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉంటున్న MLAల విషయంలో BRS తర్జనభర్జన పడుతోంది. విప్ జారీచేయాలని, దాన్ని ఉల్లంఘిస్తే కనుక అనర్హత కేసుకు బలం చేకూరుతుందని భావిస్తోంది. కాగా BRS విప్ ఇస్తే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం.


