News April 29, 2024

ఏలూరు జిల్లాలో నేతల బహిరంగ సభలు

image

ఏలూరు జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల నాయకులు జిల్లాలో బహిరంగ సభలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 30న దెందులూరుకు చంద్రబాబు నాయుడు, నేడు కొయ్యలగూడెంలో షర్మిల రెడ్డి బహిరంగ సభ, మే 1న ఏలూరులో జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు.

Similar News

News January 5, 2026

భీమవరంలో మాతృ, శిశు మరణాలపై సమీక్ష

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో సోమవారం మాతృ, శిశు మరణాలపై సబ్ కమిటీతో సమీక్ష జరిగింది. నవంబర్‌లో జరిగిన మాతృ మరణాలపై సమావేశం నిర్వహించి సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి డాక్టర్ గీతాబాయి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పలువురు వైద్యులున్నారు.

News January 5, 2026

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్

image

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సోమవారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సందర్శించారు.
హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వాటిని తొలగించి ఉద్యానవనంలా తయారు చేయాలని సిబ్బందికి చెప్పారు. రోగులకు అందతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

News January 5, 2026

గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

image

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.