News February 5, 2026

‘వైద్య సేవల్లో నాణ్యత పెంచాలి’

image

సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. మాతా-శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై ఈ వారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని వెల్లడించారు. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆయన కోరారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు.

Similar News

News February 6, 2026

NZB బయలుదేరిన ముఖ్యమంత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYD బేగంపేట విమానాశ్రయం నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌కు బయలుదేరారు. CMతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు NZB జిల్లా పర్యటనకు రానున్నారు. CM NZB జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొంటారు.

News February 6, 2026

KMR: ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య శిబిరం: DMHO

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 10 పరీక్షా కేంద్రాల్లో, నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో శనివారం నిర్వహించనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్య సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ స్టాఫ్‌తో పాటు ఆశా కార్యకర్తలు పరీక్ష పూర్తయ్యేంత వరకు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.

News February 6, 2026

మునుగోడు: విద్యాశాఖ అధికారులకు పట్టని గోడు

image

మునుగోడు మండలం పలివెల జడ్పీ హైస్కూల్‌లో విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడు లేకపోవడంతో బోధన పూర్తిగా నిలిచిపోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ, పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, వెంటనే టీచర్‌ను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.