News February 5, 2026

సత్తుపల్లి: ఉత్తీర్ణతే లక్ష్యంగా.. ‘విద్యాదీక్ష’

image

విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సత్తుపల్లి JVR ప్రభుత్వ కళాశాల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బుధవారం కళాశాల ప్రిన్సిపల్ గోపి ‘విద్యాదీక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ దీక్షలో భాగంగా విద్యార్థులు 41 రోజులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కేవలం చదువుపైనే ఏకాగ్రత వహించాలని సూచించారు.

Similar News

News February 21, 2026

కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News February 21, 2026

డిప్యూటీ సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

గంభీరావుపేట మండలంలో ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందం పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. శనివారం ఆయన అధికారులతో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.

News February 21, 2026

KMR: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండించిన కేంద్రమంత్రి

image

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ప్రజాపాలన అంటే ఇదేనా! ఇటువంటి దాడులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగడం తగదని, ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే, సాధారణ మనిషి రక్షణ ఎక్కడుందని? దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని, రాజకీయ హింసను ప్రోత్సహించవద్దని ఆయన కోరారు.