News April 29, 2024

నావల్నీని పుతిన్ చంపించి ఉండకపోవచ్చు: US

image

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీని చంపమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడ్డాయి. అమెరికా మీడియా ప్రకారం.. నావల్నీది కచ్చితంగా హత్యేనని నిఘా వర్గాలు చెప్పలేకపోతున్నాయి. అనారోగ్యం కారణంగా సంభవించిన మరణం కావొచ్చని అంచనా వేస్తున్నాయి. నావల్నీని పుతిన్ సర్కారు చాలాకాలంగా ఖైదు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో 2నెలల క్రితం ఆయన జైల్లోనే అనుమానాస్పదంగా కన్నుమూశారు.

Similar News

News January 25, 2026

UK ప్రధాని ఫైర్.. వెనక్కి తగ్గిన ట్రంప్!

image

అఫ్గాన్ యుద్ధంలో US మినహా ఇతర నాటో దేశాల సైనికులు సరిగా పోరాడలేదన్న ట్రంప్ వ్యాఖ్యలపై UK PM స్టార్మర్ <<18942081>>ఫైరయిన<<>> సంగతి తెలిసిందే. దీంతో UK ఆర్మీని ప్రశంసిస్తూ ట్రంప్ SMలో పోస్ట్ పెట్టారు. ‘UK సైనికులు ధైర్యవంతులు, గొప్పవారు. ఎప్పుడూ USతోనే ఉంటారు. ఈ బంధం ఎప్పటికీ విడిపోలేనంత బలమైనది. AFGలో 457 మంది UK సైనికులు చనిపోయారు. వారంతా గొప్ప యోధులు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

News January 25, 2026

జనవరి 25: చరిత్రలో ఈ రోజు

image

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం

News January 25, 2026

చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ అదేనా?

image

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జులై 10న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.