News February 5, 2026
తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పింక్ బస్సు సేవలు

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏర్పాటైంది. 2 పింక్ బస్సుల ద్వారా గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి సేకరించే నమూనాలను స్విమ్స్‌లో పరీక్షలు చేస్తున్నారు. 730 క్యాంపులు నిర్వహించి 42,609 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి 3,226 మందిని అనుమానితులుగా గుర్తించారు. ప్రస్తుతం 759 మంది వైద్య చికిత్స పొందుతున్నారు.
Similar News
News February 6, 2026
నిర్మల్: అవకాశమే హద్దు.. ప్రచారంలో వినూత్నం

మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్ది పొలిటికల్ హిట్ పెరిగిపోతుంది. గంపగుత్తగా ఒకే చోట ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేసుకునే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. అయితే నిర్మల్ పట్టణంలో శుక్రవారం మైనార్టీ సోదరులు నమాజ్ ముగించుకుని బయటకు వచ్చేసరికి తమ పార్టీకి ఓటు వేసి మున్సిపల్ పీఠంపై జెండా ఎగిరేలా మీ సహకారం అందించాలని BRS నేతలు కోరారు.
News February 6, 2026
ఉద్దండరాయునిపాలెం: రేపు క్వాంటం వ్యాలీకి సీఎం భూమిపూజ

రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో శనివారం క్వాంటం వ్యాలీ నిర్మాణానికి CM చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమ ప్రదేశాన్ని పర్యవేక్షించి, బందోబస్తుపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
News February 6, 2026
తిరుపతి: 32మంది విద్యార్థుల డీబార్

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో శుక్రవారం డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. వివిధ పరీక్షా కేంద్రాల్లో హైపవర్ ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీలు చేపట్టింది. చూసిరాస్తూ(మాల్ ప్రాక్టీస్) 32 మంది పట్టుబడగా.. వారందరినీ డీబార్ చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం వెల్లడించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదన్నారు.


