News February 5, 2026
తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పింక్ బస్సు సేవలు

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏర్పాటైంది. 2 పింక్ బస్సుల ద్వారా గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి సేకరించే నమూనాలను స్విమ్స్‌లో పరీక్షలు చేస్తున్నారు. 730 క్యాంపులు నిర్వహించి 42,609 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి 3,226 మందిని అనుమానితులుగా గుర్తించారు. ప్రస్తుతం 759 మంది వైద్య చికిత్స పొందుతున్నారు.
Similar News
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్ జోన్‌లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్‌ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 9, 2026
మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
News February 9, 2026
T20WCలో నేడు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్


