News April 29, 2024
ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు: CBN

AP: ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, ఫోన్లు లేని వారికి నగదు పడిందో? లేదో? ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.
Similar News
News December 27, 2025
తప్పు ఒప్పుకున్న శివాజీ

నటుడు <<18646239>>శివాజీ<<>> క్షమాపణలు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ విచారణలో ఆయన తన తప్పును అంగీకరించారని, కమిషన్ ఛైర్‌పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారని పేర్కొంది. ఇక మీదట మహిళల విషయంలో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. మహిళలను సమ దృష్టిలో చూడాలని, ఇతరుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయరాదని శివాజీకి సూచించినట్లు తెలిపింది.
News December 27, 2025
పుట్టిన రోజులకూ జంతు బలి.. ఏంటీ సంస్కృతి?

ఏపీలో ‘జంతు బలి’పై అధికార, విపక్షాల మధ్య <<18686511>>మాటల<<>> యుద్ధం కొనసాగుతోంది. మీవారే చేశారంటే.. మీవాళ్లూ చేశారంటూ TDP-YCP విమర్శలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో జంతుబలిపై నిషేధం ఉంది. అయినా పండగలు, జాతరల సందర్భంగా బలిస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తుల పుట్టినరోజులకూ వాటిని బలివ్వడం ఆందోళనకు గురి చేస్తోందని జంతు ప్రేమికులు అంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. మీరేమంటారు?
News December 27, 2025
విపత్తులతో ₹10.77 లక్షల కోట్ల నష్టం

2025లో ప్రకృతి విపత్తులతో ప్రపంచం వణికింది. హీట్‌వేవ్స్, కార్చిచ్చు, వరదల వల్ల సుమారు ₹10.77 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. శిలాజ ఇంధనాల వాడకం, క్లైమేట్ చేంజ్ వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. USలోని కాలిఫోర్నియా ఫైర్స్ వల్ల ఏకంగా ₹5.38 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఆసియాలో తుపాన్లు, వరదలతో వేలమంది చనిపోయారు.


