News April 29, 2024

అశ్విన్‌కు జట్టులో చోటే ఇవ్వను: సెహ్వాగ్

image

రాజస్థాన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరులో దూకుడు లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శించారు. వికెట్లు తీయడం లేదని మండిపడ్డారు. ‘అశ్విన్ ఈ తీరులో ఆడాలనుకుంటే నేనైతే జట్టులో చోటే ఇవ్వను. తన తోటి బౌలర్లు చాహల్, కుల్‌దీప్ వికెట్లు తీస్తుంటే, తను మాత్రం రన్స్ కట్టడి చేయాలని చూస్తున్నారు. ఆఫ్‌స్పిన్ వదిలేసి క్యారమ్ బాల్స్ వేస్తున్నారు. తన మైండ్ సెట్ మారాలి’ అని స్పష్టం చేశారు.

Similar News

News December 28, 2024

మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి

image

AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

News December 28, 2024

న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త

image

TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.

News December 28, 2024

నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

image

AP: విజయవాడ కేబీఎన్ కాలేజీ వేదికగా నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సభలను ప్రారంభించనుండగా, ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా భాషాభిమానులు, కవులు పాల్గొంటారు.