News April 29, 2024

కేరళ, తమిళనాడు తీరప్రాంతాలకు హెచ్చరికలు

image

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరప్రాంతాలకు భారత సముద్ర సమాచార సేవల సంస్థ(INCOIS) హెచ్చరికలు జారీ చేసింది. ‘కలక్కడల్ ఫినామినా’ కారణంగా కెరటాలు ఉద్ధృతంగా, ఊహించని రీతిలో విరుచుకుపడతాయని వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పౌరులు సముద్ర తీరాలకు వెళ్లొద్దని సూచించింది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో బలమైన గాలుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.

Similar News

News January 11, 2026

ఆవు పాలు, గేదె పాలు.. వీటిలో ఏవి మంచివి?

image

డెయిరీఫామ్ సక్సెస్.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా తాగే పాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఎక్కువగా ఆవు పాలు తాగే దగ్గర గేదెలతో డెయిరీఫామ్ పెట్టడం వల్ల లాభం ఉండదు. దీన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. అయితే చాలా మంది వినియోగదారుల్లో ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా? అనే సందేహం ఉంటుంది. అసలు వీటి మధ్య తేడా ఏమిటి? ఏ మిల్క్ వల్ల ఏ లాభాలుంటాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 11, 2026

ఇతిహాసాలు క్విజ్ – 124

image

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి సోదరుడు అయిన బలరాముడు ఎందుకు పాల్గొనలేదు? ఆయన ఆయుధం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 11, 2026

IOCLలో 501 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) నార్తర్న్ రీజియన్‌లో 501 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com