News February 5, 2026

కడప జిల్లా ఫారెస్ట్ భూముల్లో ఆక్రమణ.. ఇలా.!

image

ప్రొద్దుటూరులో కలిసిపోయేలా రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. అప్పటి CPI నేత MP ఎద్దుల ఈశ్వరరెడ్డి భూ-పోరాటాలు చేసి అక్కడ పేదలతో గుడిసెలు వేయించారు. ఆ ప్రాంతం ఈశ్వరరెడ్డి నగర్‌గా ప్రభుత్వ రికార్డుల్లోకెక్కింది. కాలక్రమేణా అక్కడ గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు వచ్చాయి. ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పాఠశాల తదితర మౌలిక వసతులు కల్పించాయి. ఇలా ఆక్రమణకు గురయ్యాయి.

Similar News

News February 21, 2026

పుష్పగిరి ఆలయంలో అద్భుత శిల్పాలు

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ, శ్రీవైద్యనాథ ఆలయాల్లోని కుడ్యశిల్పాలు విశేషంగా ఉన్నాయని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. ఒకే ఇతివృత్తంతో, భిన్న భంగిమల్లో శివుని ఊర్ధ్వ, చతుర తాండవాలు, పార్వతీదేవి కూర్చున్న, నిలుచున్న రూపాలు చెక్కారు. ఒకే శిల్పంలో వృషభం, నందికేశ్వరుడు వేర్వేరుగా ఉండటం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.

News February 21, 2026

మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

image

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.

News February 21, 2026

రౌడీ షీటర్లపై అప్రమత్తంగా ఉండండి: కడప SP

image

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని SP నచికేత్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్స్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.