News April 29, 2024
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ NDA నిర్ణయమే: మంత్రి ధర్మాన ప్రసాదరావు
AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోమని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ‘ఈ చట్టం తీసుకురావాలన్నది కేంద్రంలోని NDA ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇప్పుడు అదే కూటమిలో టీడీపీ చేరింది. దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే అమలుపై మేం ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 14, 2025
మహా కుంభమేళాలో విషాదం
మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News January 14, 2025
హరియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు
హరియాణా BJP చీఫ్ మోహన్ లాల్ బడోలీపై హిమాచల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోటల్‌లో July 3, 2023న మోహన్ లాల్, సింగర్ రాఖీ మిట్టల్ తనపై అత్యాచారం చేశారని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇస్తానని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.
News January 14, 2025
నేషనల్ పాలిటిక్స్‌పైనే INDIA ఫోకస్: పవార్
INDIA కూటమి కేవలం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తుందని, అసెంబ్లీ-స్థానిక ఎన్నికలపై కూటమిలో ఎలాంటి చర్చ లేదని NCP SP చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? కలిసి పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన UBT ఇప్పటికే ప్రకటించింది. స్థానిక ఎన్నికలు MVA పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.