News February 5, 2026
నేడు అమరావతికి రానున్న చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

అమరావతి ప్రాంతంలో CM చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడి సచివాలయానికి, అనంతరం 2.50 గంటలకు రాయపూడి పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని సాగునీటి సంఘాల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.50 గంటలకు నివాసానికి చేరుకొని, 6.10 గంటలకు కార్మిక శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు పర్యటన వివరాలను విడుదల చేశారు.
Similar News
News February 21, 2026
తిరుమల నాదనీరాజనంలో “శ్రీనివాస శరణం”పై భరతనాట్యం

తిరుమల నాదనీరాజనం వేదికపై“శ్రీనివాస శరణం”శీర్షికతో భరతనాట్య నృత్యావిష్కరణ భక్తులను అలరించింది. అంతరిక్ష శాస్త్రవేత్తగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందిన డాక్టర్ కావ్య కె.మాన్యపు నాట్యంతో ఆకట్టుకున్నారు. అమెరికాకు చెందిన గురువులు Dr.రత్నకుమార్, మంజుల రామస్వామి వారి శిష్యురాలు ఈమె. కాగా ఆమె శ్రీవారి భక్తిరసాన్ని నృత్యరూపంలో ఆవిష్కరించిన ప్రదర్శనకు భక్తుల నుంచి మంచి స్పందన లభించింది.
News February 21, 2026
తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రానున్న వేసవిలో జిల్లాలోని 698 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,16,934 కుటుంబాలకు, నల్లా కనెక్షన్లు లేని 1,784 గృహాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి వేసవి ప్రణాళికపై సమీక్షించారు.
News February 21, 2026
PDPL: భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్ట్

PDPLలో విడాకుల కేసు విచారణకు వచ్చిన నూనె పద్మపై ఆమె భర్త వెంకటేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెయింటెనెన్స్ కేసులు ఉపసంహరించుకోవాలని బెదిరించి, ఒప్పుకోకపోవడంతో జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకెళ్లి దాడి చేసి, తలపై రాయితో కొట్టి గాయపరిచాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న పద్మను కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు వారు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.


