News February 5, 2026

బాపట్ల: ‘ప్రతి మహిళా విద్యావంతులుగా మారాలి’

image

మహిళలకు చదువు ఎంతో అవసరమని, ప్రతి మహిళ విద్యావంతులుగా మారాలని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అన్నారు. గురువారం ఉదయం బాపట్ల మండలం ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళలు చదువుకోవడం వల్ల కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Similar News

News February 7, 2026

NZB: ‘పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్థవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.

News February 7, 2026

10 ఏళ్లలో చేయని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించాం: వీహెచ్

image

బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో చేసి చూపించామని రాజ్యసభ మాజీ సభ్యుడు వీ.హనుమంతరావు అన్నారు. వేములవాడ గాంధీనగర్లో శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం వేములవాడను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని, మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

News February 7, 2026

కాట్రేనికోన: దైవదర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం

image

కుండలేశ్వరం ఆలయ దర్శనం ముగించుకుని వస్తుండగా బైకు పైనుంచి పడి రాజమండ్రికి చెందిన పల్లి నాగలక్ష్మి(32) మృతి చెందారు. శనివారం రాత్రి కొమనపల్లి సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై జ్వాల సాగర్ తెలిపారు. భర్త కుమార్ తో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.