News February 5, 2026
ట్రక్ & బస్ డ్రైవర్ల కుమార్తెల కోసం స్కాలర్‌షిప్

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ సంస్థ మహీంద్రా సారథి అభియాన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ట్రక్ డ్రైవర్ కుమార్తె అయి, 11వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ఆదాయం 4 లక్షల్లోపు, 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ పథకం ద్వారా పదివేలు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2026. వెబ్‌సైట్: <
Similar News
News February 19, 2026
మామిడి కాయలకు ‘ఫ్రూట్ కవర్స్’తో లాభం

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.
News February 19, 2026
BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News February 19, 2026
వాము పొట్టుకు భారీ ధర!

AP: ఒకప్పుడు వృథాగా పారబోసిన వాము పొట్టు ఇప్పుడు రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా వాము పొట్టు రూ.15,468 ధర పలికింది. ఉత్తరాదిన దీనికి భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఔషధ తయారీ సంస్థలు వివిధ అవసరాల కోసం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నట్లు పేర్కొంటున్నారు. వాముకు ఉండే ఘాటైన సువాసన, ఔషధ గుణాలు పొట్టులో కూడా ఉంటాయని అంటున్నారు.


