News February 5, 2026
అనకాపల్లి జిల్లాలో 2 మద్యం బార్లకు లైసెన్స్ మంజూరు

అనకాపల్లి జిల్లా పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు డీఆర్వో వై. సత్యనారాయణ తెలిపారు. 10 దరఖాస్తులకు డ్రా నిర్వహించగా ఇద్దరికీ లాటరీ తగిలినట్లు తెలిపారు. డ్రాలో ఎంపికైన అభ్యర్ధులు పూర్తి స్థాయి ఫీజును వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News February 5, 2026
UPSC అప్లికేషన్ ప్రాసెస్‌లో కీలకమార్పులు

ఆలిండియా సర్వీసెస్ నోటిఫికేషన్ 2026లో UPSC కీలక మార్పులు చేసింది. అప్లై చేసేటప్పుడు పాస్‌పోర్ట్ ఫొటోతోపాటు లైవ్ ఫొటోను కూడా తప్పనిసరి చేసింది. 2 ఫొటోలు మ్యాచ్ కాకుంటే అప్లికేషన్ రిజెక్టవుతుందని తెలిపింది. వైట్ పేపర్‌పై బ్లాక్ ఇంక్ పెన్‌తో 3సార్లు సంతకం చేసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామ్ ప్రొసీజర్లలో పారదర్శకతకు ఈ విధానం సహాయపడుతుందని చెప్పింది.
News February 5, 2026
కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ బండారం బయటపడింది: కిషన్ రెడ్డి

దోచుకున్న డబ్బు పంచుకునే విషయంలోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, కవిత వ్యవహారమే ఇందుకు నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక మున్సిపల్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో “సారు-కారు” అంటూ రాష్ట్రాన్ని ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక వాటాల గొడవలతో ఆ కుటుంబం రోడ్డున పడిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని కోరారు.
News February 5, 2026
MNCL: ఈ నెల 6, 7న సీఎం కప్ నియోజకవర్గ స్థాయి పోటీలు

సీఎం కప్ 2025 పోటీలలో భాగంగా ఈ నెల 6, 7 తేదీలలో జిల్లాలో నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడా సేవలధికారి హనుమంతరెడ్డి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో మినీ క్రీడా మైదానం, బెల్లంపల్లి నియోజకవర్గంలో టీజీ ఆర్జేసీ తాళ్ల గురజాలలో ఈ నెల 6న, మంచిర్యాలలోని జడ్పీ పాఠశాల మైదానంలో 7న పోటీలు జరుగుతాయన్నారు.


