News February 5, 2026

హనీమూన్ మర్డర్ 2.0.. ప్రియుడితో కలిసి భర్త హత్య

image

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ తరహాలో రాజస్థాన్‌లోనూ ఓ హత్య జరిగింది. గంగానగర్ పోలీసుల కథనం ప్రకారం.. JAN 30న ఓ కపుల్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. భర్త ఆశిష్ స్పాట్‌లో చనిపోయారు. భార్య అంజు వద్ద దుండగులు నగలు దోచుకున్నారు. అయితే అతడిని కొట్టి గొంతునులిమి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసుల దర్యాప్తులో భార్యే Ex.లవర్‌‌తో కలిసి భర్తను చంపి.. ప్రమాదంగా మలిచినట్లు తేల్చారు.

Similar News

News February 26, 2026

పేటెంట్ ఎక్స్‌పైరీ.. తగ్గనున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ధరలు!

image

భారత్‌లో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ధరలు తగ్గనున్నాయి. వీటిలో వినియోగించే సెమాగ్లుటైడ్ పేటెంట్ MAR 20తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో దీని జనరిక్ వెర్షన్ తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా వంటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం నోవోనార్‌డిస్క్ సంస్థకు చెందిన Wegovy, Ozempicలలో సెమాగ్లుటైడ్ వినియోగిస్తున్నారు. వీటి ధర ₹8వేల నుంచి ₹25వేల వరకూ ఉంది. జనరిక్ వెర్షన్ వస్తే ధర 50% వరకూ తగ్గనుంది.

News February 25, 2026

రేపటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

AP: సాలకట్ల తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబైంది. అధికారులు ప్రత్యేక అలంకరణలతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రేపు సాయంత్రం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నట్లు TTD అధికారులు తెలిపారు. మార్చి 2 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ సహా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.

News February 25, 2026

మాజీ సీఎం మనవడు మృతి

image

ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మనవడు వీర్ సోరెన్(19) మరణించారు. ఫ్రెండ్స్‌తో కలిసి మనాలి ట్రిప్‌కు వెళ్లిన అతడు అక్కడే అనుమానాస్పదంగా మృతి చెందారు. ‘తలనొప్పిగా ఉందని మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే అతడు స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు’ అని మనాలి DSP శర్మ కేడీ తెలిపారు. ఈ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని చంపై సోరెన్ వాపోయారు.